Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు: దట్టమైన అడవిలో ఒంటరిగా ఆడబిడ్డ... ఆదుకున్న దిశా యాప్

ఆపదలో వున్న ఆడబిడ్డకు అండగా నిలిచింది దిశా యాప్. అడవిలో చిక్కుకున్న ఒంటరి యువతి దిశా యాప్ సాయంతో సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

Disha app helping women in guntur district
Author
Guntur, First Published Aug 29, 2021, 8:48 AM IST

గుంటూరు: ఆపదలో వున్న ఆడబిడ్డల మాన ప్రాణ  రక్షణ కోసం జగన్ సర్కార్ తీసుకువచ్చిన దిశ యాప్ సత్పలితాలనిస్తోంది. కేవలం ఆకతాయిల నుండి కాపాడుకునేందుకే కాదు అమ్మాయిలు ఎలాంటి రక్షణ కావాలన్నా ఈ యాప్ ను ఉపయోగించవచ్చని ప్రభుత్వం చేపట్టిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో ఏ ఆపద వచ్చినా అమ్మాయిలకు ముందుగా దిశా యాప్ గుర్తుకువస్తోంది. ఇలా తాజాగా దిశా యాప్ సాయంతో ఆపదలో ఉన్న ఆడబిడ్డను ఆదుకున్నారు గుంటూరు రూరల్ పోలీసులు.  

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుత్తికొండ బిలంకు బంధువులతో కలిసి సందర్శనకు వెళ్లింది యువతి. శనివారం ఉదయం వెళ్ళిన వీరంతా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ,  ప్రాచీన గుహలను చూస్తూ సాయంత్రం వరకు అక్కడే వున్నారు. సాయంత్రం బంధువులంతా ఆటోలో వెళ్లిపోగా యువతి మాత్రం స్కూటీపై తిరుగుపయనమైంది. 

ఈ క్రమంలో వర్షం పడటంతో తడిచిపోకుండా వుండేదుకు యువతి ఓ చెట్టుకింద ఆగింది. ఈ క్రమంలోనే వర్షం అధికమై రోడంతా బురదమయం అయ్యింది. దీంతో యువతి స్కూటీ బురదలో చిక్కుకుని ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలోచీకటి కమ్ముకోగా ఎటు వెళ్లాలో తెలియని నిస్సహాయ స్థితిలో అటవీ ప్రాంతంలో ఒంటరిగా మిగిలిపోయి భయబ్రాంతులకు గురయ్యింది యువతి.

read more  సినీ ఫక్కీలో ఎస్కేప్.. యువతిని కారులోకి నెట్టి, కదులుతున్న కారులోకి జంప్ చేసి.. ప్రేమికుడి సాహసం..

ఈ సమయంలోనే మహిళా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్ గుర్తుకువచ్చింది. దీంతో తన మొబైల్ లోని దిశ యాప్ ను ఉపయోగించి పోలీసుల సాయాన్ని కోరింది. దీంతో వెంటనే స్పందించిన పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్, ఎస్సై చరణ్ కి సమాచారాన్ని అందించి వెంటనే బాధితురాలిని రక్షించమని ఆదేశించారు. దీంతో ఎస్సై మహిళా పోలీసుల సహయంతో యువతి చిక్కుకున్న ప్రాంతానికి చేరుకున్నారు. యువతిని సురక్షితంగా రక్షించి క్షేమంగా ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించారు.  

ఆపదలో ఉన్న తనను దిశా యాప్ ద్వారా రక్షించిన పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్, ఎస్సై చరణ్, మహిళా పోలీసులకు యువతి యువతి కృతజ్ఞతలు తెలిపింది. ప్రతి ఒక్కరు దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని... ఆపదలో ఉన్న వారికి ఈ యాప్ అండగా నిలిచి అభయంగా ఉంటుందని తెలిపింది. ఇలా దట్టమైన అటవీ ప్రాంతంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్న వేళ వెలుగు నింపిన దిశా యాప్. 

Follow Us:
Download App:
  • android
  • ios