ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వివాదాస్పద కామెంట్స్ చేయడంలో ముందుంటారు. ఏదో ఒక దాంట్లో వెలుపెడుతూ.. ఎవరినోకరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేయడం ఆయనకు సరదా. తాజాగా.. ఏపీ రాజకీయాలపై ఆయన ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి కేఏ పాల్ అని, ఏపీలోని 175 స్థానాలకు గానూ 175 స్థానాల్లో ఆయన పార్టీ విజయం సాధిస్తుందని వర్మ ట్వీట్ చేశాడు. జీసస్ క్రైస్ట్ తర్వాత ప్రపంచలోనే అత్యంత గొప్ప వ్యక్తి కేఏ పాల్ అని వర్మ వ్యంగ్యాస్త్రం సంధించాడు. 

 ప్రధాని మోదీతో పాల్ కలిసి ఉన్న ఫొటోను జతచేసి మరీ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగని వర్మ, ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రానికి లీడర్ అవ్వడానికి బదులుగా.. చంద్రబాబు, వైఎస్ జగన్, నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ లాంటి చిన్న వ్యక్తులతో పోటీకి బదులుగా.. తన స్నేహితుడు జీసస్ క్రైస్ట్‌ను అడిగి ప్రపంచ ఎన్నికలు జరిగేలా చూసి.. ప్రపంచ నేతగా కేఏ పాల్ ఎదగాలని రాంగోపాల్ వర్మ ఆకాంక్షించారు. ఆ ట్వీట్లు వర్మ వెటకారంగా చేసినట్లు తెలుస్తోంది.