గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా డిజిటల్ మహానాడు2021 నిర్వహించనున్నట్లు చంద్రబాబు సోషల్ మీడియా వేదికన వెల్లడించారు.
అమరావతి: ప్రస్తుత కరోనా సమయంలో మహానాడును డిజిటల్ పద్దతిలోనే నిర్వహించనున్నట్లు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా డిజిటల్ మహానాడు2021 నిర్వహించనున్నట్లు చంద్రబాబు సోషల్ మీడియా వేదికన వెల్లడించారు.
''స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశనం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించాం'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
read more బిసి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ సుప్రీంకోర్టుకు..: చంద్రబాబు వెల్లడి
''మే 27, 28 తేదీలలో ఆన్ లైన్లో జరిగే #DigitalMahanadu2021(డిజిటల్ మహానాడు2021)లో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు.. తదితర అంశాలపై తీర్మానం చేయనున్నాం. అందరూ కలిసి రండి. 'డిజిటల్ మహానాడు 2021'ను విజయవంతం చేయండి'' అంటూ సోషల్ మీడియా వేదికన పిలుపునిచ్చారు చంద్రబాబు.
