Asianet News TeluguAsianet News Telugu

సచివాలయ, పంచాయతీ అధికారుల బాధ్యతల వికేంద్రీకరణ: ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు

సచివాలయాల్లోని డ్రాయింగ్‌ ఆఫీసర్‌ వ్యవస్థలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది.

Different DDOs in village secretariat and panchayats...AP Government Decission
Author
Amaravati, First Published Mar 26, 2021, 11:56 AM IST

అమరావతి: ఇకపై గ్రామ సచివాలయాలు, పంచాయతీలకు వేర్వేరుగా డీడీవోలు వుంటారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సచివాలయాల్లోని డ్రాయింగ్‌ ఆఫీసర్‌ వ్యవస్థలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. గ్రామ సచివాలయాలు- పంచాయితీల డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సచివాలయాల్లో ఇప్పటి వరకు ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు చేస్తూ ఆదేశాలిచ్చింది. పంచాయితీ ఉద్యోగులకు పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారి డీడీఓగా వ్యవహరించనున్నారు. ఇక గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులందరికీ డీడీఓగా వీఆర్వోకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకూ మొత్తం డ్రాయింగ్ అండ్ డిస్‌బర్స్‌మెంట్‌ అధికారి బాధ్యతల్ని కూడా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులే నిర్వర్తించారు. కాగా ఇకపై పంచాయతీలకు, సచివాలయాలకు వేర్వేరుగా డీడీఓలు నియమించింది. పంచాయితీలకు, సచివాలయాలకు లింక్ అధికారిగా గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తూ ఏపీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios