వైసీపీలో చేరనున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..?

First Published 24, Jul 2018, 3:47 PM IST
did bjp mla vishnu kumar raju joins in ycp?
Highlights

కొద్ది రోజులుగా ఆయన బీజేపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. జగన్ పాదయాత్ర వైజాగ్ చేరుకుంటే.. ఆ పాదయాత్రలోనే పార్టీ ఫిరాయించాలని ఆయన చూస్తున్నట్లు సమాచారం. అందుకు బలమైన కారణం కూడా ఉందట.

బీజేపీ కీలక నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. సొంత పార్టీని వీడి..వైసీపీలోకి అడుగుపెట్టనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. విష్ణుకుమార్ రాజుకి పార్టీలనూ, తన నియోజకవర్గంలోనూ మంచి పేరు ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే.. బీజేపీ నేతగా కన్నా కూడా వ్యక్తిగతంగా ఆయనను అభిమానించేవారి సంఖ్య ఎక్కువ.

కొద్ది రోజులుగా ఆయన బీజేపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. జగన్ పాదయాత్ర వైజాగ్ చేరుకుంటే.. ఆ పాదయాత్రలోనే పార్టీ ఫిరాయించాలని ఆయన చూస్తున్నట్లు సమాచారం. అందుకు బలమైన కారణం కూడా ఉందట.

ప్రస్తుతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై రాష్ట్ర ప్రజలంతా కోపం ఉన్నారు. ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై పడే   అవకాశం కూడా ఉంది. నియోజకవర్గంలో తనకు ఎంత మంచి పేరు ఉన్నా.. పార్టీ ప్రభావం కచ్చితంగా పడుతుందని ఆయన భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు దగ్గరపడడానికి ముందే వైసీపీలో చేరాలనుకుంటున్నట్లు సమాచారం.

వైసీపీ తీర్థం పుచ్చుకొని.. ఆ పార్టీ గుర్తుతోనే వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇదెంత వరకు నిజమో తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

loader