అనంతపురం జిల్లా కలెక్టర్‌పై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ లెక్కచేయడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు

అనంతపురం జిల్లా కలెక్టర్‌పై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ లెక్కచేయడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జిల్లాకు మేజిస్ట్రేట్ అయితే చంపేస్తారంటూ ఆయన నిలదీశారు. కలెక్టర్ గురించి చెప్పాలంటే చాలా పేజీలు అవుతుదంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురం కలెక్టర్ ఓ పనికిమాలినోడంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

కలెక్టర్ ఇవాళ ఉంటాడు.. రేపు పోతాడని చెప్పారు. కలెక్టర్ తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాడని.. కలెక్టర్ వ్యవహారంపై సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని కేతిరెడ్డి హెచ్చరించారు.

ఎమ్మెల్యేలను వెదవలను చూసినట్లు చూస్తున్నాడని.. చివరికి మంత్రులను కూడా వెదవలను చూసినట్లు చూస్తున్నాడంటూ వెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. ఈ జిల్లాలో ఏం పరిపాలన జరుగుతుందో తనకు తెలియదని.. ఎవ్వడూ పై నుంచి దిగి రాలేదని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు.

రేపట్నుంచి ప్రజల దగ్గరకు పోవాల్సింది తామేనని.. కలెక్టర్ తీరు పట్ల మేమంతా చింతిస్తన్నామని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లవారిపల్లెలో జరిగిన ఘటన బాధపెడుతోందని.. దీనిపై తాను మంత్రి బొత్స, కలెక్టర్‌తో పదిసార్లు మాట్లాడానని కేతిరెడ్డి చెప్పారు.

ఒక పనికిమాలిన కలెక్టర్ వల్ల ఆ ఊరిలో పండగ జరిపించనందుకు బాధగా వుందని.. చిల్లవారిపల్లెలో ఎటువంటి వివాదాలు లేవని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.