వైసీసీ నియోజవర్గస్థాయి ప్లీనరీలో ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పార్టీ నేతలకు హెచ్చరికలు జారీచేశారు. వైసీపీలో గ్రూపులు, ఆధిపత్య పోరు సరికాదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన, పనిచేసిన ఉపేక్షించేది లేదన్నారు.
వైసీసీ నియోజవర్గస్థాయి ప్లీనరీలో ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పార్టీ నేతలకు హెచ్చరికలు జారీచేశారు. నరసన్నపేటలోని ఎన్‌ఏఆర్ కల్యాణమండలంలో శుక్రవారం ఈ కార్యక్రమ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. పార్టీలో కొందరు అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని.. అలాంటివారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలో అందరిని కలుపుకుని పోవాలని సూచించారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తనకు తెలుసని.. కొందరు అనుచితంగా చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తున్నానని చెప్పారు.
వైసీపీలో గ్రూపులు, ఆధిపత్య పోరు సరికాదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన, పనిచేసిన ఉపేక్షించేది లేదన్నారు. వారి తీరు మారకుంటే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. నేల విడిచి సాము చేయకండని పార్టీ శ్రేణులకు సూచించారు. ఒక నియోజకవర్గంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అవ్వడం కుదురుతుందా అని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తానే వైసీపీ అభ్యర్థినని స్పష్టం చేశారు.ఎంతమంది ఏకమైనా ఇక్కడ తాను ఎమ్మెల్యేనని, రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అని చెప్పారు. తాను అమాయకుడిని కాదని.. అమాయకుడిని అయితే నాలుగుసార్లు గెలిచేవాడినా..? అని కామెంట్ చేశారు. తనకు అందరి మనోభావాలు తెలుసని అన్నారు.
