అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కొలువులోకి తొలి అధికారిని తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ధనంజయ్ రెడ్డి శనివారం నియమితులయ్యారు. 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నప్పటికీ తన కార్యదర్శిగా ధనంజయ్ రెడ్డిని నియమించుకున్నారు. 

సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన ధనంజయ్ రెడ్డికి మంచి పేరు ఉంది. పాలనాదక్షుడిగా కూడా పేరుంది. ఉత్తరాంధ్ర జిల్లాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పదవి నుంచి ఆయన ఇటీవల పర్యాటక శాఖకు బదిలీ అయ్యారు. 

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించే ఉద్దేశంతోనే ఆయన ధనంజయ రెడ్డిని తన కార్యదర్శిగా నియమించుకున్నట్లు తెలుస్తోంది.