తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లన్నీ శిలాతోరణం వరకు చేరుకున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి 25 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లన్నీ శిలాతోరణం వరకు చేరుకున్నాయి. పెరటాసి మాసం మూడో శనివారం కావడంతో పాటు దసరా , వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి 25 గంటలకు పైగా సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ 2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్లూ భక్తులతో నిండిపోయాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 4 వరకు అంతంత మాత్రంగా వున్న భక్తుల రద్దీ ... అక్టోబర్ 5 నుంచి క్రమంగా పెరిగిపోయిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
