ప్రభుత్వానిది నీకృష్టమైన ఆలోచన.. వికృతమైన చర్య అంటూ విజయనగరం జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర బహిరంగసభలో వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైరయ్యారు మంత్రి దేవినేని ఉమ. 

ప్రభుత్వానిది నీకృష్టమైన ఆలోచన.. వికృతమైన చర్య అంటూ విజయనగరం జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర బహిరంగసభలో వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైరయ్యారు మంత్రి దేవినేని ఉమ.

ఇవాళ విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. నిన్న అంబులెన్స్‌లో ఉంది వైసీపీ కార్యకర్తేనని అన్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం తాటిపూడి గ్రామానికి చెందిన వల్లూరి శ్రీనివాస్.. నీ సభ కోసం లారీలో అక్కడి వచ్చాడని.. కిందకు దిగుతుండగా కార్యకర్తలతో ఉన్న మరో ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు.

దీంతో అక్కడున్న కార్యకర్తలు 108కి ఫోన్ చేశారని.. ఘటనాస్థలికి చేరుకున్న 108 వాహనం అతన్ని తీసుకుని ఎటు వెళ్లాలో తెలియక.. ఒకే రోడ్ ఉండటంతో నువ్వు నిలుచున్న వైపు వచ్చిందన్నారు. జనం దగ్గర మార్కులు కొట్టేయడానికి ‘‘జరగండి.. జరగండి ’’ అంటూ జగన్ డ్రామాలు ఆడారని ఉమా ఆరోపించారు.

ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్ గారికి రాజకీయాల్లోకి వచ్చి ఇంతకాలమైనా బహిరంగసభలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదా అని దేవినేని ప్రశ్నించారు. సభలు, సమావేశాలు విశాలమైన మైదానాల్లో పెట్టుకుంటారని.. అంతేకానీ సందుల్లో, గొందుల్లో బహిరంగసభలు పెట్టరని మంత్రి ఎద్దేవా చేశారు.

ఐటీ దాడులకు ప్రభుత్వం భయపడుతోందంటూ జగన్ అంటున్నారని.. కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశానికి భయమంటే ఏంటో తెలియదన్నారు. తాను చెప్పినది ఆబద్ధమైతే నిజం నిరూపించాలంటూ ఉమ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.