గుడివాడ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేయనున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
గుడివాడ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేయనున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా.. దీనిపై తాజాగా అవినాష్ స్పందించాడు. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధమేనని ఆయన తెలిపారు.
త్వరలో తెలుగు యువత రాష్ట్ర నాయకుడిగా దేవినేని అవినాష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనకు అప్పగించిన తెలుగు యువత రాష్ట్ర బాధ్యతలను బుధవారం స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి హాజరు కానున్నారని చెప్పారు.
యువతను చైతన్యవంతులను చేసి పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని చెప్పారు. సీనియర్ టీడీపీ నాయకుడు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ... అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ తెలుగుయువత ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.
