Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ పై పాట... డిప్యుటీ సీఎం టిక్ టాక్ వీడియో వైరల్

విజయనగరం జిల్లాలో స్థిరపడిన ఆమె భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు జగన్ డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు. 

Deputy CM Pushpa Srivani Tik Tok Video With CM YS Jagan Song Becomes Viral
Author
Hyderabad, First Published Jan 1, 2020, 10:18 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తనకు ఉన్న అభిమానాన్ని డిప్యుటీ సీఎం పుష్పవాణి సరికొత్తగా తెలియజేశారు. ఆయన పాటకు టిక్ టాక్ చేశారు. ఇప్పుడు ఈ టిక్ టాక్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ప్రశంసిస్తూ.. ‘రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న..’ అనే పాటకు ఆమె టిక్‌టాక్ వీడియో చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆమె పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. 

విజయనగరం జిల్లాలో స్థిరపడిన ఆమె భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు జగన్ డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు. 

జగన్ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె ఓ చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషించారని తెలుస్తోంది. అలాగే ఎక్కడ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా ఆమె ఆటపాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆమధ్య ఆహె గిరిజనులతో చేసిన డాన్సుల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ప్రచారంలో భాగంగా వైఎస్సార్ పార్టీ ప్రముఖ గాయని మంగ్లీతో ఓ పాట పాడించారు. ఆ పాట మీదే పుష్పవాణి టిక్‌టాక్ వీడియో చేశారు. ఈ పాట ఏపీ ప్రజలను.. ముఖ్యంగా రాయలసీమ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. జగన్ పాదయాత్రలోని ఆసక్తికర సన్నివేశాలతో ఈ పాటను రూపొందించారు.

కాగా, ఇటీవలే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో సచివాలయ ప్రతిపాదనలు చేశారు. దీనిపై రైతుల నుంచి ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. 

"

Follow Us:
Download App:
  • android
  • ios