తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుది ఏడుపు గుర్తు అని విమర్శించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో ‘‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’’లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. నవరత్నాలపై చంద్రబాబు ఏడుస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాలు తీసుకున్న ప్రజలు మాత్రం చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. సీఎం జగన్‌ గుర్తు చిరునవ్వు అని.. చంద్రబాబుది ఏడుపు గుర్తు అని అన్నారు. 

Also Read: రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి వివరాలు ఇవే..

ఇదిలా ఉంటే.. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్ధితి లేదన్నారు. చంద్రబాబుతో వున్న వారందరిది రాక్షస మనస్తత్వమన్నారు. జగనే మా నమ్మకం అని 90 శాతం మంది ప్రజలు చెప్పకుంటే తాను రాజకీయాలను వదిలేస్తానని నారాయణ స్వామి సవాల్ విసిరారు.