ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలివే.. కొత్తవారికి కీలకమైన బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు సీఎం చంద్రబాబు పదవులు కేటాయించారు. అందరూ ఊహించినట్లే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలు దక్కాయి. ఇంకా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?

Departments assigned to AP Ministers..  Key responsibilities are freshers GVR

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఒకరికి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. పలువురు సీనియర్లకు కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. నారా లోకేశ్‌ గతంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేయగా... ఈసారి విద్య, మానవ వనరులు, ఐటీ, ఆర్టీజీ శాఖలు అప్పగించారు. నారాయణ గతంలో మున్సిపల్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా అదే శాఖ అప్పగించారు. కొల్లు రవీంద్ర ఎక్సైజ్‌, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించగా.. ఈసారి ఎక్సైజ్, గనులు, భూగర్భ శాఖలు కేటాయించారు. కీలకమైన ఆర్థిక, జలవనరుల శాఖలను సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులకు కేటాయించారు. అలాగే, తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారికి సైతం పలు ప్రధాన్య శాఖల బాధ్యతలు అప్పగించారు. 

నారా చంద్రబాబు నాయుడు - సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

కొణిదెల పవన్‌ కల్యాణ్‌ - ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, అటవీ- పర్యావరణం, శాస్త్ర సాంకేతికత శాఖలు
నారా లోకేశ్‌ - విద్య, మానవ వనరులు, ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్
కింజరాపు అచ్చెన్నాయుడు - వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్య శాఖలు
నాదెండ్ల మనోహర్‌ - పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
కొల్లు రవీంద్ర - ఎక్సైజ్, గనులు, భూగర్భ శాఖలు
పొంగూరు నారాయణ - పురపాలిక & పట్టణాభివృద్ధి
వంగలపూడి అనిత - హోం, డిజాస్టర్ మేనేజ్మెంట్
సత్యకుమార్ యాదవ్ -  వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం
నిమ్మల రామానాయుడు - జల వనరుల అభివృద్ధి
నస్యం మహమ్మద్‌ ఫరూక్ - మైనారిటీ సంక్షేమం, న్యాయ శాఖలు
ఆనం రామనారాయణరెడ్డి - దేవాదాయ శాఖ
పయ్యావుల కేశవ్ - ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు
అనగాని సత్యప్రసాద్ - రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్
కొలుసు పార్థసారథి - హౌసింగ్, ఐ&పీఆర్
డోలా బాలవీరాంజనేయస్వామి - సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్లు
గొట్టిపాటి రవి కుమారు - విద్యుత్ శాఖ
కందుల దుర్గేష్ - పర్యాటక, సాంస్క్రుతిక, సినిమాటోగ్రఫీ
గుమ్మడి సంధ్యారాణి  - మహిళా శిశుసంక్షేమం, గిరిజన సంక్షేమం
బీసీ జనార్థన్ రెడ్డి - రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
టీజీ భరత్ - పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్
ఎస్.సవిత - బీసీ సంక్షేమం, EWC సంక్షేమం, చేనేత, జౌళి
వాసంశెట్టి సుభాష్ - కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & బీమా వైద్య సేవలు
కొండపల్లి శ్రీనివాస్ - ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధఆలు
మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి - రవాణా, యూత్ & క్రీడలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios