దళితుల మనోభావాలను కించపరిచేలా తాను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇందుకు నిరసనగా ఆయన ఏలూరులో అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారంటూ ఆరోపించారు. శ్రీరామవరం సభలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వాటిని వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వీడియోలపై ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

దళితులపై నోరు పారేసుకున్న చింతమనేని (వీడియో)