పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ విషయమై పెంటపాటి పుల్లారావు పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశించిందింది. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల పట్ల సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు,.

గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకొందని, ఈ విషయమై తన పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించి విచారణకు ఆదేశాలు జారీ చేయాలని పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.5 వేల కోట్లకు పెంచిన విషయాన్ని ఆయన ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ ను విచారించిన హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పోలవరం ప్రాజెక్టులో అనేక అవకతవకలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.ఈ అవినీతికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడ ఆయన ఆ పిటిషన్‌లో ఆరోపించారు. పెంటపాటి పుల్లారావు ఫిర్యాదుపై ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.