వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన బికామ్ లో ఫిజిక్స్ చదివిన ఫిరాయింపు ఎంఎల్ఏ జలీల్ ఖాన్ జగన్మోహన్ రెడ్డిని సవాలు చేశారు.
ఫిరాయింపు ఎంఎల్ఏ కూడా క్యామిడీ చేస్తున్నారు. వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన బికామ్ లో ఫిజిక్స్ చదివిన ఫిరాయింపు ఎంఎల్ఏ జలీల్ ఖాన్ జగన్మోహన్ రెడ్డిని సవాలు చేశారు.వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటారట. మరి, తాను గెలిస్తే..జగన్ రాజకీయాల నుండి తప్పుకుంటారా ? అంటూ పెద్ద సవాలే విసిరారు.
అదే సమయంలో జగన్‌పై జలీల్‌ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజనకు జగన్‌నే ప్రధాన కారణమన్నారు. కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డి మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీకి మరో పదేళ్లు చంద్రబాబే సీఎం అని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు.
