Asianet News Telugu

డ్యాన్స్ లు, టిక్ టాక్ వీడియోలతో సందడి చేసే దీప్తిశ్రీ: కంటతడిపెట్టిస్తున్న సవతి తల్లి ఘాతుకం

 దీప్తి శ్రీ సైతం చాలా చురుకుగా ఉంటుంది. డ్యాన్స్ లతో అందర్నీ ఆకట్టుకునేంది. అందరూ దీప్తిశ్రీని చాలా చక్కగా చూసుకునేవారు. ఆమె ఎంత యాక్టివ్ అని తెలుసుకునేందుకు ఆమె చేసిన టిక్ టాక్ వీడియోలే నిదర్శనం. 

Deepthi sri murder case: father & relatives crying for remember her activeness
Author
Kakinada, First Published Nov 25, 2019, 5:17 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కాకినాడ: సవతి తల్లి చేతులో హత్యకు గురైన ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ విషాద ఘటనపై అంతా విషాదం నెలకొంది. సవతి తల్లి శాంతకుమారి వల్ల ఎప్పటికైనా తన బిడ్డకు ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించాడు తండ్రి శ్యామ్ కుమార్. 

తన మెుదటి భార్య ప్రతిరూపంగా భావిస్తూ తన కుమార్తె దీప్తిశ్రీని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. తన బిడ్డ తల్లిలేనిది కాకూడదనే ఉద్దేశంతోనే శ్యామ్ కుమార్ శాంతకుమారిని పెళ్లి చేసుకున్నాడని స్థానికులు చెప్తున్నారు. 

అయితే ఏడాది క్రితం శాంతకుమారి మగబిడ్డకు జన్మినివ్వడంతో అప్పటి నుంచి దీప్తిశ్రీపై కోపంతో రగిలిపోతూ ఉండేదని తెలుస్తోంది. తండ్రి ఇంట్లో లేని సమయంలో శాంతకుమారి దీప్తిశ్రీని దారుణంగా హింసించేదని కూడా స్థానికులు చెప్తున్నారు. 

దీప్తిశ్రీ పట్లే తన భర్త శ్యామ్ కుమార్ ప్రేమ చూపిస్తుండటంతో తట్టుకోలేకపోయిన శాంతకుమారి నిత్యం చిన్నారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేది. వాతలు పడేలా కొట్టేది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఆ చిన్నారి ఎవరికీ చెప్పలేన నానా యాతన అనుభవించింది. 

ఏడేళ్ల పసిప్రాయంలో తాను ఎదుర్కొంటున్న కష్టాలను ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంది. తల్లి లాలనలో ఎంతో అపురూపంగా పెరగాల్సిన ఆ చిన్నారి శాంతకుమారి అనే రాక్షసి చేతులో నరకం అనుభవించిందని ఆ చిన్నారి నానమ్మ చెప్తోంది. అయితే ఏడాది క్రితం శాంతకుమారి దీప్తిశ్రీని దారుణంగా కొట్టింది.  
 
దీప్తిశ్రీని ఏడాది క్రితం దారుణంగా గాయపరిచింది శాంతకుమారి. మానవత్వం మరచిపోయి పసిపాప అన్న సోయకూడా లేకుండా బాలిక వంటిపై వాతలు పెట్టింది. ఆ విషయాన్ని తండ్రి శ్యామ్ కుమార్ గుర్తించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కుమార్తె ఒంటిపై రక్తపు మరకలను చూసి చలించిపోయాడు.
 
భార్యతో గొడవపెట్టుకున్నాడు. అనంతరం బాలికను తన చిన్నమ్మ ఇంటి వద్ద ఉంచి జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో చదివిస్తున్నాడు. సంజయ్‌నగర్‌ నుంచి చిన్నమ్మ ఇంటికి వెళ్లి ప్రతీ రోజూ పాపను స్కూల్‌కి దింపి వస్తున్నాడు.  

చిన్నమ్మ ఇంటి దగ్గర ఉంటున్న దీప్తిశ్రీని తండ్రి శ్యామ్ కుమార్ ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. దీప్తి శ్రీ సైతం చాలా చురుకుగా ఉంటుంది. డ్యాన్స్ లతో అందర్నీ ఆకట్టుకునేంది. అందరూ దీప్తిశ్రీని చాలా చక్కగా చూసుకునేవారు. ఆమె ఎంత యాక్టివ్ అని తెలుసుకునేందుకు ఆమె చేసిన టిక్ టాక్ వీడియోలే నిదర్శనం. 

సవతి తల్లి చెర నుంచి తన కుమార్తెను కాపాడుకున్నాననే సంతోషంలో ఉన్నాడు తండ్రి శ్యామ్ కుమార్. తన భార్య వల్ల ఇక ఎప్పటికీ తన కుమార్తెకు ఎలాంటి ప్రమాదం ఉందని భావించాడు. బిడ్డను దూరం చేసినా ఆ రాక్షసి మనసు మారుతుందనుకున్నాడు. 

రోజు ఉదయం, సాయంత్రం దీప్తిశ్రీ దగ్గరకు వెళ్లడం అక్కడ గడపడంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఇక దీప్తిశ్రీని చంపేయాలన్నంత కసి పెంచుకుంది. అదును కోసం ఎదురుచూసింది. కడుపులో పెట్టుకుని చూడాల్సిన పసికందు గొంతు నులిమి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ ఘటన కాకినాడలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అందర్నీ కలచివేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios