ఏలూరులో మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో 15 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వీరి మరణానికి కల్తీ మద్యమే కారణం అని ప్రచారం జరుగుతోంది. 


ఏలూరు : రెండు రోజుల్లో (బుధ, గురువారాల్లో)15 మంది మృతి చెందడం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృత్యువాత పడటం Mysteryగా మారింది. కొందరిలో 
Vomiting, diarrhea, abdominal pain వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరడం.. గంటల వ్యవధిలో మృతి చెందడం విషాదం మిగుల్చుతోంది. 

వీరిలో ఎక్కువ మందికి Alcohol అలవాటు ఉందని... కల్తీసారా తాగి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరిద్దరు 60 నుంచి 70 ఏళ్ల వారు కాగా మిగిలిన వారు నలభై నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులు. వీరంతా కూలి పనులు, చిన్న వృత్తులు చేసుకునే వారు. వీరిలో కొందరికి కుటుంబసభ్యులు ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద, మరికొందరిని ప్రాంతీయ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించారు. బుట్టాయగూడెం రోడ్డులోని గాంధీ బొమ్మ సెంటర్ లోని ఓకే వీధిలో ఇద్దరు చనిపోయారు. 

‘మా నాన్న ముడిచర్ల అప్పారావు (45) కడుపు నొప్పి.. అంటే ఆర్ఎంపీ వద్ద చూపించాం. తరువాత పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లాం. కొద్దిసేపటికి మా నాన్న చనిపోయారు’ అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాపీ పనులు చేసే బండారు శ్రీనివాసరావు (45) కడుపునొప్పితో బాధపడితే గురువారం ఉదయం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు ఆయన మేనల్లుడు వెంకట తెలిపారు. ‘వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఐసీయూలో పెట్టారు. కొద్దిసేపటికే మామయ్య చనిపోయారు అని చెప్పారు’ అని అన్నారు. అత్యధిక మరణాలు ఇదే తీరులో సంభవించినట్లు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, బీహార్ లో ఇటీవలి కాలంలో కల్తీ మద్యం కలకలం రేపింది. జనవరిలో సంపూర్ణ Prohibition of alcohol అమలులో ఉన్న State of Biharలో Adulterated alcohol తాగి ఐదుగురు మరణించారు. బీహార్లోని బక్సర్ జిల్లా దుమ్రావ్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మరణించారు. కల్తీ మద్యం తాగిన మరో నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఐదుగురు deathపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

బీహార్లోని సరన్ జిల్లాలోనూ కల్తీ మద్యం తాగడం వల్ల ఐదుగురు మరణించిన ఘటన జరిగిన వారంలోపే మరో విషాదం జరిగింది. దానికి వారం రోజుల ముందు నలంద జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. గత ఏడాది కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై బీహార్ సీఎం Nitish Kumar దర్యాప్తునకు ఆదేశించారు. కల్తీ మద్యం తాగి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రతిపక్షాలు సీఎం నితీష్ కుమార్ పై విమర్శ లకు దిగారు. 

మిత్రపక్షమైన BJP కూడా సీఎంపై ధ్వజమెత్తింది. మద్యనిషేధ చట్టం పూర్తిగా విఫలమైనందున దాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ డిమాండ్ చేశారు. మద్యనిషేధం చట్టాన్ని కఠినంగా అమలు చేయని అధికారులే డబ్బులు దండుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బీహార్ లో కల్తీ మద్యం వల్ల మరణాలకు బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ఆర్జెడి అధికార ప్రతినిధి శక్తి సింగ్ యాదవ్ కోరారు.