తమిళనాడులో రోడ్డు ప్రమాదం: లారీలోకి ఎగిరిపడిన డెడ్‌బాడీ, కర్నూలులో ప్రత్యక్షం

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 12, Jan 2019, 2:13 PM IST
dead body found at cement lorry
Highlights

ఓ ఘోర రోడ్డు ప్రమాదం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే...కర్నూలు జిల్లా రాచర్ల వద్ద గల ప్రియా సిమెంట్స్ ఫ్యాక్టరీకి చెందిన లారీలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహాన్ని సిబ్బంది కనుగొన్నారు. 

ఓ ఘోర రోడ్డు ప్రమాదం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే...కర్నూలు జిల్లా రాచర్ల వద్ద గల ప్రియా సిమెంట్స్ ఫ్యాక్టరీకి చెందిన లారీలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహాన్ని సిబ్బంది కనుగొన్నారు. దీనిపై పోలీసులకు సమాచారాన్ని అందించగా విచారించిన ఖాకీలు సదరు యువకుడిని తమిళనాడుకు చెందిన సుధాకర్‌గా గుర్తించారు.

ఈ నెల 9న తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పాండూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోన్న సుధాకర్ ఆ రోజు సాయంత్రం విధులు ముగించుకుని బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు అతను ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సుధాకర్ కాలు తెగి రోడ్డుపై పడగా.. అతని మృతదేహం ప్రియాసిమెంట్స్ లారీలోకి ఎగిరిపడింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించిన తమిళనాడు పోలీసులు కర్నూలు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. వారు చెప్పిన గుర్తుల ఆధారంగా ఆరా తీయగా సిమెంట్ లారీలో మృతేదహాం కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని తిరువళ్లూరు పోలీసులకు తెలియజేశారు.

loader