కృష్ణా జిల్లా గుడివాడలో సీన్ రివర్సయ్యింది. ఓ కోడలే అత్తను వేధించడం కాదు ఏకంగా హత్యాయత్నానికి పాల్పడింది. 

విజయవాడ: సాధారణంగా కోడలిని అత్తలు వేధించే ఘటనలు మనం చూస్తుంటాం. కానీ కృష్ణా జిల్లా గుడివాడలో సీన్ రివర్సయ్యింది. ఓ కోడలే అత్తను వేధించడం కాదు ఏకంగా హత్యాయత్నానికి పాల్పడింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... గుడివాడ మండలం మందుపాడుకు చెందిన లక్ష్మి అనే మహిళకు శివ నారాయణ అనే కొడుకు వున్నాడు. అతడికి లక్ష్మి అనే యువతికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లయిన నాటి నుండి అత్తాకోడళ్లకు అస్సలు పడక గొడవలు జరిగేవి. 

read more కుమార్తెకు వేధింపులు: యువకుడిని చంపిన తండ్రి

అయితే ఇటీవల కాలంలో తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగివ్వలేదని అత్తతో కోడలు గొడవపడుతోంది. ఈ క్రమంలో అత్తపై కోపంతో రగిలిపోయిన కోడలు దారుణానికి ఒడిగట్టింది. అత్త ఇంట్లో నిద్రిస్తుండగా సలసలకాగే నూనెనుఆమెపై పోసి హత్యాయత్నానికి పాల్పడింది. 

వేడివేడి నూనె ఒంటిపై పడటంతో అత్త లక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా వుందని తెలుస్తోంది. ఈ హత్యాయత్నంపై సమాచారం అందుకున్న గుడివాడ 2 టౌన్ పోలీసులు బాధిత మహిళ కొడుకు చుక్కా శివ నారాయణ, కోడలు లక్ష్మీలను అదుపులోకి తీసుకున్నారు.