ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దర్శి ఒకటి. ప్రకాశం జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసిపి ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో  మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు... కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనను కాదని వైసిపి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని బరిలో దింపింది. టిడిపి కూడా ఈసారి కొత్తగా ఓ మహిళా అభ్యర్థిని పోటీలో పెట్టింది. దీంతో దర్శి ప్రజలు ఎవరికి మద్దతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

దర్శి రాజకీయాలు :

ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో టిడిపి , వైసిపి రెండూ బలంగానే వున్నారు.  ఇక్కడ టిడిపి తరపున 1983లో కాటూరి నారాయణస్వామి, 1985, 1994 లో నారపుశెట్టి శ్రీరాములు, 1997 లో నారపుశెట్టి పాపారావు ఎమ్మెల్యేలుగా పనిచేసారు. చివరగా  2014 లో మాజీ మంత్రి సిద్దా రాఘవులు దర్శి  నుండి ప్రాతినిధ్యం వహించారు. 

అయితే గత అసెంబ్లీ (2019)ఎన్నికల్లో దర్శిలో మొదటిసారి వైసిపి గెలిచింది. మద్దిశెట్టి వేణుగోపాల్ టిడిపి అభ్యర్థి కదిరి బాబురావును ఓడించారు. అయితే ఈసారి  వేణుగోపాల్ ను కాకుండా మరో కొత్త అభ్యర్థిని వైసిపి బరిలోకి దింపుతోంది. 

దర్శి నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. తాళ్లూరు
2.  కురిచెడు
3.  ముండ్లమూరు
4.  దర్శి
5.  దొనకొండ
 
 దర్శి అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,14,440 

పురుషులు -   1,08,112
మహిళలు ‌-    1,06,318

దర్శి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు ఈసారి దర్శి టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని  దర్శి పోటీలో నిలిపింది వైసిపి అదిష్టానం.

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి దర్శిలో కొత్త అభ్యర్థిని పోటీలో పెట్టింది. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు, మాజీ ఎమ్మెల్యే నరసయ్య కూతురు గొట్టిపాటి లక్ష్మిని దర్శి బరిలో నిలిపింది టిడిపి. 

దర్శి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

దర్శి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,95,348 (91 శాతం) 

వైసిపి -  మద్దిశెట్టి వేణుగోపాల్ - 1,11,914 ఓట్లు (57 శాతం) - 39,057 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి- కదిరి బాబురావు - 72,857 ఓట్లు (37 శాతం) - ఓటమి
 
దర్శి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,82,010 (91 శాతం)

టిడిపి - సిద్దా రాఘవులు - 88,821 (49 శాతం) ‌- 1,574 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి - 87,447 (48 శాతం) ఓటమి