విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తోంది. (వీడియో)

darkness at noon in Vizag
Highlights

విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తోంది. (వీడియో)

విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తోంది.  పట్టపగలే ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో పగలే   చీకటి పడ్డట్లయింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నాలుగు రోజుల నుంచి ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్న ఉత్తరాంధ్ర జిల్లావాసులు ఒక్కసారిగా మారిన వాతావరణంతో సేదతీరారు. భారీ వర్షం కురవడంతో  వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మరోవైపు భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు చాలా  ఇబ్బందులు పడ్డారు.

loader