మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హైదరాబాద్‌ను రెండో రాజధాని కావాలని చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అని బీజేపీ మాయమాటలు చెబుతోందని విమర్శించారు.
హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హైదరాబాద్‌ను రెండో రాజధాని కావాలని చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అని బీజేపీ మాయమాటలు చెబుతోందని విమర్శించారు. హైదరాబాద్ ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయని అన్నారు. విద్యాసాగర్ రావును బలిపశువును చేసేందుకు బీజేపీ ఇలాంటి స్టేట్‌మెంట్స్ చేయిస్తోందని విమర్శించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కూడా దానం నాగేందర్ స్పందించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారనేది కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రాజ్యాంగ పరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వనరుల నుంచి వస్తున్న ఆదాయంతోనే తెలంగాణ అభివృద్ది జరుగుతుందని చెప్పారు. కిషన్ రెడ్డి తన మాయమాటలను పక్కన పెట్టాలన్నారు. కేంద్రం ఇప్పటికైనా తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక, శుక్రవారం విద్యాసాగర్ రావు శుక్రవారం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేయాలని అన్నారు. ఇదే మాట అప్పట్లోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా చెప్పారని తెలిపారు. అన్ని పార్టీలు దీనిపై ఆలోచించాలని అన్నారు. అవసరమైన భూములు, భవనాలు, అనుకూలమైన వాతావరణంతో కూడిన హైదరాబాద్.. దేశానికి రెండవ రాజధానిగా మారడానికి సహజమైన ఎంపిక అని చెప్పారు.
