దగ్గుబాటి ఫ్యామిలీ.. వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 27న తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు.

తనతోపాటు తన తనయుడు హితేష్ చెంచురామ్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా అదే రోజు వైసీపీలో చేరతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు తరలిరావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.

సోమవారం రాత్రి మార్టూరు, యద్దనపూడి మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో దగ్గుబాటి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో మార్టూరు, పర్చూరు శాసన సభ్యులుగా 5 సార్లు విజయం సాధించానన్నారు. జగన్ మాట తప్పే మనిషి కాదని ఈ సందర్భంగా దగ్గుబాటి పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ని సీఎం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. అనంతరం హితేష్ మాట్లాడుతూ.. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చానన్నారు