రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏను పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది

రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. డీఏను 3.144 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శనివారం జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తామని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్‌ చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు ఆర్ధిక శాఖ తెలిపింది. 2018 జూలై 1వ తేదీన 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో 38.776 శాతానికి పింఛన్‌దారుల డీఏ పెరగనుంది