Cyclone Michaung:బాపట్ల వద్ద తీరాన్ని తాకిన మిచౌంగ్ తుఫాన్, 20 అడుగులు ముందుకొచ్చిన సముద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల వద్ద మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని తాకింది. మూడు గంటల్లో తుఫాన్ తీరాన్ని దాటనుంది.

Cyclone Michaung: Landfall of storm begins lns

బాపట్ల:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల వద్ద   మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని తాకింది.  మిచౌంగ్  తుఫాన్  తీరాన్ని దాటే ప్రక్రియ మరో మూడు నుండి నాలుగు గంటలు పట్టే అవకాశం ఉంది.  తుఫాన్ తీరం దాటిన  తర్వాత 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  వార్నింగ్ ఇచ్చింది. బాపట్ల వద్ద మిచౌంగ్ తుఫాన్ తీరం దాటడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. దరిమిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.  బాపట్ల వద్ద తుఫాన్ తీరాన్ని తాకడంతో  సముద్రం 20 అడుగులు ముందుకు చొచ్చుకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. 

also read:Cyclone Michaung..నెల్లూరు-బాపట్ల మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్: భారీ వర్షాలు

ఈ తుఫాన్ ప్రభావంతో  ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో  ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి.  తుఫాన్ ప్రభావంతో  ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.  రాష్ట్రంలోని 11 జిల్లాలకు  వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

ఈ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  తమిళనాడులోని పలు జిల్లాల్లో  వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావం ఉన్న జిల్లాలో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటిస్తున్నారు.  మరో వైపు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  11 జిల్లాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో  పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దరిమిలా వర్ష ప్రభావిత జిల్లాల్లో పునరావాస కేంద్రాలను  ఏర్పాటు చేశారు. 

మరో 24 గంటల పాటు  వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇవాళ రాత్రికి కూడ  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.  వర్షం కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. ఈ వర్షాలతో పలు పంటలు దెబ్బతిన్నాయి.  చేతికొచ్చిన పంట దెబ్బతిందని రైతాంగం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.  భారీ వర్షాలతో ఇంతకాలం పడిన కష్టం నీటిపాలైందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios