అసానీ తుఫాన్: ఏపీ, ఒడిశాలకు ఐఎండీ వార్నింగ్
ఆగ్నేయ బంగాళాఖాతంలో అసానీ తుఫాన్ ఏర్పడింది. ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రకటించారు.ఈ విషయమై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా ఐఎండీ సూచించింది.
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దానికి ఆనుకొని దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం నాడు అల్పపీడనం వాయువ్యంగా పయనించింది. శనివారం ఉదయానికి వాయుగుండంగా రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Asani తుఫాన్ సోమవారం నాడు ఉదయం నాటికి రెండు దశల్లో మరింత తీవ్రతరం కానుంది. ఇది తీవ్రమైన చాలా తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉందన్నారు.
మంగళవారం నాటికి ఆంద్రప్రదేశ్ ఒడిశా తీరానికి తుఫాన్ చేరుకొంటుంది.ఈ నెల 10వ తేదీ వరకు వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకొని ఒడిశా తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని IMD ప్రకటించింది.
దీని ప్రభావంతో ఈ నెల 10,11 తేదీల్లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంట గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా వాతావరణశాఖాధికారులు సూచించారు.
విశాఖపట్టణానికి 930 కి.మీ దూరంలో అసానీ Cyclone కేంద్రీకృతమైంది.గంటకు 13 కిమీ. వేగంతో తుఫాన్ కదులుతున్నట్టుగా వాతావరణశాఖ అధికారులు వివరించారు.ఇవాళ సాయంత్రానికి ఇది తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది.ఉత్తర కోస్తా, ఒడిశా రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఆసానీ తుఫాన్ మంగళవారం సాయంత్రం వరకు వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరాలకు ఆవల పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది.ఆ తర్వాత ఇది ఈశాన్య తూర్పు దిశగా తిరిగి వాయువ్య Bay of Bengal వైపు Odisha తీరానికి చేరుకొనే అవకాశం ఉందని ఐఎండీ ఆదివారం నాడు తెలిపింది.
ఈ తుఫాన్ ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం నుండి భారీ నుండి అతి భారీ Rains కురిసే అవకాశం ఉంది. 24 గంటల్లో 24 నుండి 204 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో కూడా 64 నుండి 115.5 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ప్రభావంతో బీహార్, పశ్చిమ బెండాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఆదివారం నుండి మధ్య బంగాళాఖాతం మీదుగా ఈ నెల 10, 11 తేదీల్లో 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.