బెజవాడ దుర్గమ్మను సైతం సైబర్ కేటుగాళ్లు వదలడం లేదు. ఇంద్రకీలాద్రిపైన ఫోకస్ పెట్టిన నేరగాళ్లు.. దుర్గమ్మ చీరలు, పసుపు, కుంకుమ అంటూ అమాయక భక్తలకు ఎరవేస్తున్నారు.

గర్భగుడిలో ప్రత్యేక పూజలంటూ నమ్మబలుకుతూ టోకరా వేస్తున్నారు. స్థానికంగా ఇతర ఏజెన్సీల పేరుతో ఫోన్‌ కాల్స్ చేసి భక్తులను బురిడి కొట్టించి, డబ్బులు దండుకుంటున్నారు.

కాల్ లీస్ట్‌లో మీకే లాటరీ తగిలిందంటూ భక్తులకు మస్కా కొడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. అమ్మవారి చీరలను కౌంటర్‌లలో మాత్రమే విక్రయిస్తామని ఎటువంటి ఏజెన్సీలకు బాధ్యలు అప్పగించలేదని హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.