పచ్చళ్ల పేరుతో అస్ట్రేలియాకు డ్రగ్స్: బెజవాడ కొరియర్ ఆఫీసులో కస్టమ్స్ అధికారుల సోదాలు

విజయవాడ డీటీఎస్ కొరియర్ ద్వారా నార్కోటిక్స్ డ్రగ్స్  సరఫరా చేసినట్టుగా బెంగుళూరు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పచ్చళ్ల పేరుతో అస్ట్రేలియాకు డ్రగ్స్ పంపిన విషయమై  విచారణ చేస్తున్నారు.

Customs Officers Searches At Vijayawada Courier Office


విజయవాడ: బెజవాడ లోని ఓ కొరియర్ వ్వారా నార్కోటిక్స్ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా బెంగుళూరు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బెజవాడ నుండి అస్ట్రేలియాకు ఈ కొరియర్ ను పంపారు. ఈ కొరియర్ ను ఎవరు పంపారనే విషయమై కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఓ కొరియర్ సెంటర్ లో Courier బాయ్  ఆధార్ కార్డుతో Australiaకు నార్కోటిక్స్ డ్రగ్స్ పంపారు.  అస్ట్రేలియాలో సరైన చిరునామా ఇవ్వకపోవడంతో కొరియర్ తిరిగి Bangloreకు చేరుకొంది. అయితే ఈ కొరియర్ లో Drugs ఉన్నట్టుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

ఈ కొరియర్ ను పంపిన వ్యక్తి  Aadhar కార్డు ఆధారంగా బెంగుళూరు కస్టమ్స్ అధికారులు విచారణ నిర్వహించారు. Vijayawada లోని కొరియర్ కార్యాలయంలో పనిచేసే  వ్యక్తి ఆధార్ కార్డుతో అస్ట్రేలియాకు కొరియర్ పంపిన విషయాన్ని దర్యాప్తులో గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఈ ఏడాది జనవరి 31 సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి పచ్చళ్లు పంపాలని కొరియర్ కార్యాలయానికి వచ్చినట్టుగా కొరియర్ సిబ్బంది కస్టమ్స్ అధికారుల విచారణలో వెల్లడించారు. అయితే పచ్చళ్ల పేరుతో డ్రగ్స్ ను అస్ట్రేలియాకు ఎవరు పంపారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయవాడలోని కొరియర్ ద్వారా నాలుగు కిలోల నార్కోటిక్స్ డ్రగ్స్ ను తరలించేందుకు పక్కా పథకం ప్రకారంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios