Asianet News TeluguAsianet News Telugu

పాత కారులో భారీగా పట్టుబడ్డ కొత్త నోట్ల కట్టలు,విదేశీ కరెన్సీ, బంగారం...

ఓ డొక్కు కారు రోడ్డుపై దూసుకుపోతుంటే...దాని వాలకం చూసి అనుమానం వచ్చిన పోలీసులు దాన్ని చేజ్ చేసి పట్టుకున్నారు. దాంట్లో తనీఖీలు చేపట్టిన పోలీసులకు కళ్లు బైర్లుకమ్మాయి. అందులో సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓ అరలో భారీగా కొత్త నోట్ల కట్టు, విదేశీ కరెన్సీ, బంగారాన్ని గుర్తించారు. 

Currency, gold seized from two Chennai-bound persons
Author
Nellore, First Published Jan 24, 2019, 9:19 AM IST

ఓ డొక్కు కారు రోడ్డుపై దూసుకుపోతుంటే...దాని వాలకం చూసి అనుమానం వచ్చిన పోలీసులు దాన్ని చేజ్ చేసి పట్టుకున్నారు. దాంట్లో తనీఖీలు చేపట్టిన పోలీసులకు కళ్లు బైర్లుకమ్మాయి. అందులో సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓ అరలో భారీగా కొత్త నోట్ల కట్టు, విదేశీ కరెన్సీ, బంగారాన్ని గుర్తించారు. దీంతో వీటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆంద్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో బుధవారం జరిగిన ఈ  ఘటన రాష్ట్రవ్యప్తంగా కలకలం రేపింది. 

నెల్లూరు జిల్లా సుళ్లూరు పేటకు చెందిన పోలీసులు తడ సమీపంలో అనుమానితంగా రోడ్డుపై  ఓ కారు ప్రయానించడాన్ని గుర్తించారు. దీంతో కారును ఆపడానికి ప్రయత్నించగా కారు వేగం మరింత పెరిగింది. దీంతో పోలీసులు ఆ కారును చేజ్ చేసి పట్టుకున్నారు.అందులో  వున్న డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడే కారును తనిఖీ  చేశారు. కారులో భారీ నగదును గుర్తించిన పోలీసులు ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

ఈ తనిఖీల్లో పట్టుబడిని దేశీయ కరెన్సీ కట్టలు, విదేశీ కరెన్సీ, బంగారం కలిపి రూ.6.40 కోట్లు విలువ ఉంటుందని అధికారులు తేల్చారు. వీటికి సంబంధించి పట్టుబడిన వ్యక్తుల దగ్గర  ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాదీనం చేసుకున్నారు. 

అనంతరం పట్టుబడిన వ్యక్తులను విచారించి పోలీసులు ప్రాథమికంగా కొంచెం సమాచారాన్ని రాబట్టగలిగారు. ఈ పట్టుబడిని నగదు నరసాపురానికి చెందిన ఓ నగల వ్యాపారిది కాగా...ఓ రాజకీయ నేత సూచనల మేరకు చెన్నైకి తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. దీంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తునేు వేగవంతం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios