కేంద్రంలో ఎంతో బలంగా ఉన్న నరేంద్రమోడి సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన క్రెడిట్ వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే, నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఏ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేదు. సరే, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినంత మాత్రాన ఏమవుతుందన్నది వేరే సంగతి.

అసలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటమంటేనే కేంద్రప్రభుత్వంపై విశ్వాసం లేదని చెప్పటమే కదా ఉద్దేశ్యం. గడచిన పాతికేళ్ళల్లో మోడి అంత బలమైన ప్రధాని లేరని కదా అందరూ చెబుతున్నది. లోక్ సభలో సంపూర్ణ మెజారిటీతో మోడి ప్రధాని అవటమే అందుకు నిదర్శనం. అటువంటిది మోడిపైనే జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటమంటే మాటలా? అందుకే జగన్ పై జాతీయ మీడియాలో అంత స్ధాయిలో ప్రచారం జరుగుతోంది. అది చూసే చంద్రబాబునాయుడుకు ఒళ్ళమండిందని వైసిపి వర్గాలంటున్నాయి. ఎనీ డౌట్ ?