కాకినాడలో అపార్ట్‌మెంట్స్ దెబ్బతింటున్నాయి. నగరంలోని దేవీ మల్టీప్లెక్స్ కు సమీపంలోని భాస్కర్ ఎస్టేట్ అపార్ట్‌మెంట్ వెనుక భాగంలో ఉన్న మూడు పిల్లర్లు బీటలు వారాయి.

ఇందులో మొత్తం 40 ఫ్లాట్లు ఉన్నాయి.. భయాందోళనకు గురైన జనం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి, అపార్ట్‌మెంట్ బీటలు వారేందుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.

ఈ భవనం సుమారు 13 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి  వుంది.