వైసీపీ సర్కార్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తీవ్ర విమర్శలు చేశారు. అప్పులు చేయడంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానానికి చేరుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
వైసీపీ సర్కార్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తీవ్ర విమర్శలు చేశారు. అప్పులు చేయడంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానానికి చేరుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఏడాదికి రూ. 41 వేల కోట్లు అప్పులు తెస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆరు నెలల్లో రూ. 49 వేల కోట్లు అప్పు తెచ్చిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడిచాలంటే.. ప్రతిపక్షాలు ఏకతాటి పైకి రావాలని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈరోజు ఆయన సెఫరేట్ అంటున్నారని మండిపడ్డారు.
బీజేపీ, వైసీపీ పరస్పరం కలిసిపోయాయని రామకృష్ణ ఆరోపించారు. కేంద్రానికి ప్రతి విషయంలో వైసీపీ ఎంపీలు సహకరిస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు అన్ని తెలిసే నటిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుతం పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేస్తారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. బీజేపీ, వైసీపీలు ఒక్కటేనన్న భావనలో ప్రజలు ఉన్నారని తెలిపారు.
