ప్రముఖ నటుడు చిరంజీవిపై ఇటీవల సీపీఐ నాయకులు నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నారాయణకు వ్యతిరేకంగా మెగా అభిమానులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే తాను చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టుగా నారాయణ చెప్పారు.

ప్రముఖ నటుడు చిరంజీవిపై ఇటీవల సీపీఐ నాయకులు నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నారాయణకు వ్యతిరేకంగా మెగా అభిమానులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే తాను చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టుగా నారాయణ చెప్పారు. ఓ తెలుగు న్యూస్ చాన‌ల్‌తో మాట్లాడిన నారాయణ.. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలను భాష దోషంగా పరిగణించాలని తెలిపారు. ఈ వ్యాఖ్యలను మెగా అభిమానులు మర్చిపోవాలని కోరారు. 

ఇక, కాపు నాడు, చిరంజీవి అభిమానులు కలిసి వరద బాధితులకు సాయం అందించాలని నారాయణ కోరారు. వరద సహాయక చర్యల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలమయ్యారని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పోలవరం వివాదం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. 

Also Read: నారాయణకు కాస్త అన్నం పెట్టండి.. : చిరంజీవిపై చేసిన కామెంట్స్‌పై నాగబాబు కౌంటర్

అసలేం జరగిందంటే..
ఇటీవల సీపీఐ నారాయణ మాట్లాడుతూ... ఇటీవల భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభకు చిరంజీవిని పిలవడాన్ని తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడని కామెంట్ చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. నారాయణ మాట్లాడుతూ...“పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రజలను మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణను పక్కనబెట్టి ఈ చిల్లర బేరగాడ్ని చిరంజీవిని స్టేజి మీదకి తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రాలేదో నాకు తెలియదు. కానీ వచ్చి ఉంటే గౌరవంగా ఉండేది. పవన్‌ కళ్యాణ్‌ ఓ ల్యాండ్ మైన్ వంటివాడు. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. ఆయన కూడా అంతే. ఎప్పుడు ఏవిదంగా వ్యవహరిస్తారో ఎవరికీ తెలియదు. 

అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై నారాయణ చేసిన ఈ కామెంట్స్‌పై మెగా అభిమానులతో పాటు, జనసైనికకులు మండిపడుతున్నారు. పలుచోట్ల నారాయణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మెగాబ్రదర్ నాగబాబు.. నారాయణ‌కు కౌంటర్‌గా ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. 

‘‘ఇటీవలి కాలంలో మెగా అభిమానులు, జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే.. ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు. అందుకే మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి ...! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’’ అని నాగబాబు ట్వీట్ చేశారు.