విశాఖపట్నంలో సీపీఐ నేత నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ హరిత రిసార్ట్ నిర్మాణ స్థలం పరిశీలనకు వెళ్తుంగా రుషికొండ కూడలి వద్ద పోలీసులు ఆయనను అడ్డగించారు.

విశాఖపట్నంలో సీపీఐ నేత నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ హరిత రిసార్ట్ నిర్మాణ స్థలం పరిశీలనకు వెళ్తుంగా రుషికొండ కూడలి వద్ద పోలీసులు ఆయనను అడ్డగించారు. పోలీసలు తనను అడ్డుకోవడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థల పరిశీలనకు అభ్యంతరాలు ఏమిటో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రుషికొండ తవ్వకాలతో ప్రకృతి సందపను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతిని నాశనం చేస్తామంటే ఊరుకునేది లేదని అన్నారు. 

ఐదు ఎకరాల్లో నిర్మాణాలని చెప్పి.. 30 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతున్నారని నారాయణ ఆరోపించారు. రుషికొండ మొత్తం తవ్వేస్తారా అని ప్రశ్నించారు. రుషికొండను చూస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. తాము ఏమైనా ఉగ్రవాదులమా అని ప్రశ్నించారు. రుషికొండలో ఉల్లంఘనపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.