మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఇదే అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఇదే అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నారాయణ మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు బయటికి వచ్చాయని.. నిందితులు ఎవరో బయటపడ్డారని వ్యాఖ్యానించారు.
వివేకా హత్యకు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలని నారాయణ అన్నారు. కానీ ప్రస్తుతం సీబీఐపై కూడా ఎదురుదాడి జరుగుతుందని.. అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడికిపోతోందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఇక, బిగ్‌బాస్ షోపై కూడా నారాయణ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా డిజిటల్ ప్రచారం చేస్తున్నామని నారాయణ తాజాగా తెలిపారు. బిగ్‌బాస్ హౌస్ బ్రోతల్ హౌస్‌గా మారిందని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వంద రోజుల పాటు యువతీ,యువకులను ఓ ఇంట్లో నిర్భందించడమేంటని ప్రశ్నించారు. అన్నమయ్య, రామదాసువంటి సినిమాలు తీసిన వ్యక్తి ఇలాంటి షోలు నిర్వహించడం ఏమిటన్నారు. లైసెన్స్ పొందిన వ్యభిచార గృహం నిర్వహించడానికి షో నిర్వహిస్తున్నారంటూ నారాయణ విమర్శించారు.
