దేశంలోని రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. ఏపీలో విధ్వంసకర రాజకీయం జరుగుతోందని.. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని.. బీజేపీలో ఎవరు కలిసినా వాళ్లపైనా పోరాటం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు.
విశాఖలో రెండోరోజూ సీపీఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నారాయణ, రామకృష్ణ హాజరయ్యారు. సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహన లేదన్నారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని.. బీజేపీలో ఎవరు కలిసినా వాళ్లపైనా పోరాటం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. బీజేపీని వైసీపీ, టీడీపీ పట్టుకుని వెళ్లాడుతున్నాయని ఆయన సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ అటు ఇటుగా వున్నారని.. తోక పార్టీగా చర్చించుకున్న వామపక్షాలే తలనే ఆడిస్తాయని నారాయణ అన్నారు. ఏపీలో విధ్వంసకర రాజకీయం జరుగుతోందని.. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఈ సందర్భంగా డీ.రాజా మాట్లాడుతూ ఏపీలో ప్రత్యేకమైన రాజకీయ పరిస్ధితులున్నాయన్నారు. ఏపీలో అధికార, విపక్షాలు మోడీ మెప్పు కోసం ప్రత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు సీపీఐ పోరాటం చేస్తోందని డీ.రాజా చెప్పారు. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఏకం కావాలని.. ప్రాంతీయ పార్టీలు ఏకం చేసే బాధ్యత వామపక్ష శక్తులదేనని ఆయన తెలిపారు.
