అధిక ధరలు, పన్నులకు వ్యతిరేకంగా సీపీఐ నేడు చలో సచివాలయానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సచివాలయ ముట్టడికి సీపీఐ శ్రేణులు బయలుదేరాయి. అయితే పోలీసులు ఎక్కడిక్కడ సీపీఐ నాయకులను అడ్డుకుంటున్నారు.
అధిక ధరలు, పన్నులకు వ్యతిరేకంగా సీపీఐ నేడు చలో సచివాలయానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సచివాలయ ముట్టడికి సీపీఐ శ్రేణులు బయలుదేరాయి. అయితే పోలీసులు ఎక్కడిక్కడ సీపీఐ నాయకులను అడ్డుకుంటున్నారు. జిల్లాలో సీపీఐ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం, గృహ నిర్భందం చేయడం చేపట్టారు. అనంతపురంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్‌కు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు రామకృష్ణను అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు తీసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత రామకృష్ణను పోలీసులు విడుదల చేశారు. రామకృష్ణ అరెస్ట్‌కు నిరసనగా అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు.
అనంతపురంలో సీపీఐ ఆందోళనల్లో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ.. సెక్రటేరియట్‌ను ముట్టడించి తీరుతామని చెప్పారు. అరెస్ట్‌లు చేసినా భయపడేది లేదన్నారు. సెక్రటేరియట్ ప్రాంతంలో వందలాది పోలీసులు మోహరించారని.. అయినప్పటికీ ఎర్రజెండా ఎగురుతుందని చెప్పారు. భవిష్యతుల్లో అన్ని వర్గాలను కలుపుకుని ధరలను తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఇక, విజయవాడ సీపీఐ కార్యాలయం నుంచి సెక్రటేరియట్ నుంచి సెక్రటేరియట్‌కు ర్యాలీగా బయలుదేరిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే ధరల పెంపుకు వ్యతిరేకంగా సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు ఏపీ సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చలో సచివాలయానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక, ఎట్టి పరిస్థితుల్లోనూ సచివాలయం ముట్టడించి తీరుతామని సీపీఐ నేతలు చెబుతున్నారు.
