ఆ...బోట్లన్నీ మంత్రుల బినామీలవేనా ?

Cpi alleges unofficial boats belongs to devineni and pattipati benamis
Highlights

  • కృష్ణా నదిలో నడుస్తున్నఅనధికార బోట్లన్నీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు బినామీలవే అంటూ సీపీఐ నేత దోనెపూడిశంకర్ పెద్దబాంబే పేల్చారు.

కృష్ణా నదిలో నడుస్తున్నఅనధికార బోట్లన్నీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు బినామీలవే అంటూ సీపీఐ నేత దోనెపూడిశంకర్ పెద్దబాంబే పేల్చారు. మొన్నటి ఆదివారం సాయంత్రం కృష్ణానదిలో అనధికార బోటు ప్రమాదంలో 22  మంది మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ప్రభుత్వంలోని ముఖ్యులు బాగా ఇబ్బంది పడుతున్నారు.

అదే విషయమై బుధవారం విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్బగంగా శంకర్ మాట్లాడుతూ బోటు ప్రమాదానికి కారకులైన వారి వెనకున్న బినామీలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. అదే విధంగా ప్రమాద తీవ్రత దృష్ట్యా జాతీయ మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. అలాగే,  జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి జ్యూడిషియల్ ఎంక్విరీ వేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి పర్మిషన్లు లేకుండా కృష్ణా నదిలోకి అక్రమంగా బోట్లు తిరుగుతుండం వెనుక ఉన్న ప్రముఖులపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  అక్రమముగా నడుస్తున్న బొట్లను స్వాధీనం చేసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

ఇలాఉండగా కృష్ణా నది లో దాదాపు 400 బొట్లు నడుస్తున్నాయనే విషయం ఆశ్చర్యం కలిగిస్తోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కృష్ణానది నుండి రాజధాని నగరం విజయవాడ తో సహా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు సాగు నీరు తో పాటు త్రాగునీరు కూడా సరఫరా అవుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో భారీ సంఖ్యలో బొట్లు విడుదల చేస్తున్న ఆయిల్ వ్యర్ధాలతో ఈ నీరు త్రాగుతున్న ఆయా జిల్లాల్లోని లక్షలాది ప్రజల ఆరోగ్యం ఏమికావాలని పర్యావరణ నిపుణులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఇలాటి అక్రమ నిర్వహణ పట్ల ఉదాసీనంగా ఉంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం మంచి పనికాదని వారు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

loader