Asianet News TeluguAsianet News Telugu

కరోనా మహమ్మారిపై ఉచిత ఆన్లైన్ కోర్సులు: కోవిడ్-19 ఏపీ నోడల్ ఆఫీసర్

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి ‘ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్‌’(ఐగాట్‌) పోర్టల్ లో ఉచిత కోర్సులు అందిస్తున్నట్లు  కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ వెల్లడించారు

COVID19 related free online courses
Author
Amaravathi, First Published Jun 27, 2020, 11:15 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి ‘ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్‌’(ఐగాట్‌) పోర్టల్ లో ఉచిత కోర్సులు అందిస్తున్నట్లు కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ వెల్లడించారు. iGOT పోర్టల్ ద్వారా కోవిడ్‌-19 సంబంధిత కోర్సులను నేర్చుకుని అవగాహన పెంచుకుని భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితోపాటు యువత కూడా తమ వంతు పాత్ర పోషించవలసిన అవసరం   ఉందని శ్రీకాంత్ పేర్కొన్నారు.  

''భార‌తశంలో కోవిడ్‌-19 కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వైద్యులతోపాటు పారామెడికల్ సిబ్బందితోపాటు పలువురు పలువురు ఫ్రంట్ లైన్ లో విరోచిత పోరాటం చేస్తున్నారు. కోవిడ్‌-19 వైరస్ ఇప్పుడు నగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతోంది'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటూనే బాధితులకు వైద్య సేవలు అందించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్రంట్ లైన్ సిబ్బంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్‌-19 వైరస్ ను కట్టడి చేసేందుకు, ముందుండి వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు వీలుగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ(హెచ్ఆర్‌డీ) కి చెందిన  'దీక్ష' పోర్టల్ వేదికగా ‘ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్‌’(iGOT)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కోవిడ్ ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఫ్రంట్‌లైన్ సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా iGOT ను తీర్చిదిద్దారు'' అని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. 
 
ఎవరెవరు ఈ కోర్సులను నేర్చుకోవచ్చు?

''వైద్యులు, న‌ర్సులు, పారామెడిక్స్, పారిశుద్ధ్య కార్మికులు, సాకేంతిక సిబ్బంది, ఏఎన్ఎంలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పౌర ర‌క్షణ అధికారులు, వివిధ పోలీసు సంస్థలు, ఎన్‌సీసీ స‌భ్యులు, నెహ్రూ యువ కేంద్ర సంఘ‌ట‌న్ (ఎన్‌వైకెఎస్‌) కార్యక‌ర్తలు, నేష‌న‌ల్ స‌ర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్‌) కార్యక‌ర్తలు, ఇండియ‌న్ రెడ్ క్రాస్ సోసైటీ ఉద్యోగులు, భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక‌ర్తల‌తో పాటు ఇత‌ర వాలంటీర్లకు ఉపయోగపడేలా శిక్షణా కార్యక్రమాలను ఇందులో రూపొందించారు. 

ఎక్కువ మందికి సౌల‌భ్యంగా ఉండేలా ఈ పోర్టల్ లో ఉండే కోర్సులను మీకు అనువైన సమయంలో మరియు మీరు ఉండే ప్రాంతం నుంచే ఉచితంగా నేర్చుకునే సౌలభ్యం కలదు. ఈ శిక్షణా మాడ్యూల్‌ను ఫ్లెక్సిటైమ్, సైట్ బేసిస్‌పై అందిస్తున్నారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి క‌ట్టడికి గాను అవ‌స‌ర‌మైన శ్రామిక శ‌క్తికి త‌గిన నైపుణ్యత‌ను అందించే ఉద్దేశంతో రూపొందించిన ఈ పోర్టల్‌ను https://igot.gov.in/igot/ అనే వెబ్‌లింక్‌ ద్వారా ఓపెన్ చేసి ఉచితంగా శిక్షణ పొందవచ్చు'' అని వివరించారు డాక్టర్ శ్రీకాంత్. 

iGOT పోర్టల్ లో అందుబాటులో ఉన్నకొన్ని ముఖ్యమైన కోర్సులు 

• Basics of COVID-19

• Clinical Management - COVID-19

• Quarantine and Isolation

• Management of COVID-19 Cases (SARS, ARDS & Septic shock)

• Infection, Prevention and Control

• Laboratory Sample Collection and Testing

• ICU Care and Ventilation Management

• Psychological care of patients with COVID-19

• COVID-19 Training for NCC Cadets

• Trainee Onboarding_MoHFW
 

 

Follow Us:
Download App:
  • android
  • ios