ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం: నలుగురు నిందితులు ఈడీ కస్టడీకి
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నలుగురు నిందితులను ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు నలుగురు నిందితులను ఈడీ విచారించనుంది.
హైదరాబాద్: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నలుగురు నిందితులకు ఈడీ కస్టడీకి సోమవారం నాడు కోర్టు అనుమతిని ఇచ్చింది. వారం రోజుల పాటు నలుగురు నిందితులను ఈడీ అధికారులు విచారించనున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మూడు రోజులక క్రితం సీమెన్స్ మాజీ ఎండీ శేఖర్, బోస్, డీజీ టెక్ ఎండీ వికాస్ వినాయక్, పీపీఎస్‌పీ ఐటీ ప్రాజెక్టు సీఈఓ ముకుల్ చంద్ర అగర్వాల్ , ఎస్ఎస్ఆర్ అసోసియేట్స్ సురేష్ గోయల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపర్చారు. అయితే నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని అడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నలుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన శ్రీకాంత్
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే అనుమానంతో విచారణ జరపాలని ఏపీ సీఐడీ అధికారులు ఈడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. సీఐడీ రాసిన లేఖ ఆధారంగా ఈడీ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు.
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ పని చేసింది. యువతకు అవసరమైన శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఉపాధి చూపించడం ఈ పథకం లక్ష్యం.. ఈ విషయమై చంద్రబాబు సర్కార్ తో సీమెన్స్ ,డిజైన్ టెక్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని జగన్ సర్కార్ అనుమానించింది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ పై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశార. ఈ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులుఈ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో కొన్ని షెల్ కంపెనీలను గుర్తించినట్టుగా సీఐడీ అధికారులు ప్రకటించారు. షెల్ సంస్థల ద్వారా డబ్బును కొల్లగొట్టారని సీఐడీ అనుమానించింది . దీంతో ఈడీ విచారణకు సీఐడీ అధికారులు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ విషయమై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు 2022 డిసెంబర్ మాసంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 మందిని విచారించింది. మూడు రోజుల క్రితం ఈ కేసులో నలుగురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.