తాడేపల్లి మండలం పెనుమాకలో ఎటువంటి భూసేకరణకు పాల్పడవద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాలు రైతులకు అందాయి.

తాడేపల్లి మండలం పెనుమాకలో ఎటువంటి భూసేకరణకు పాల్పడవద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాలు రైతులకు అందాయి. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రాజధాని గ్రామాల్లోని కొందరు రైతుల నుండి బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోంది. బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తూ రైతుల తరపున వైసిపి మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టుకెక్కారు. రెండు వైపుల వాదనలు విన్న తర్వాత రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తాలూకు కాపీలను వైసిపి నేతలు శుక్రవారం రైతులకు అందచేశారు.

మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 10 గ్రామాలో ప్రభుత్వ చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. 500 మంది రైతులకు సంబంధించి 1200 ఎకరాలను బలవంతపు భూసేకరణ నుంచి కాపాడినట్లు ఆళ్ళ చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రైతులకు అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు.

తర్వాత ఎంఎల్ఏలు ఆర్కే, ముస్తాఫా తో పాటు రావి వెంకటరమణ, లావు. శ్రీకృష్ణదేవరాయులు, కత్తిరే క్రిష్టిన అన్నబతుల శివకుమార్, లేళ్లఆప్పిరెడ్డి తదితరులు పొలాల్లోకి దూకి దున్నారు. రాజధాని పేరుతో ప్రభుత్వం రియల్ఎస్టేట్ చేస్తోందని ఆర్కెమండిపడ్డారు. మూడు పంటలు పండే భూములను రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రైతులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అండగా ఉంటుందని వైసిపి నేతలు హామీ ఇచ్చారు.