ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ఈ నెల 26 వరకు పొడిగింపు: జైలుకు తరలింపు

ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ ను పొడిగించింది కోర్టు.ఈ నెల 26వ తేదీ వరకు కోర్టు రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. దీంతో రాజమండ్రి జైలుకు ఎమ్మెల్సీ అనంతబాబును తరలించారు పోలీసులు. 

Court Extends MLC Anantah Babu Remand Till August 26th

హైదరాబాద్: ఎమ్మెల్సీ అనంతబాబుకు  రిమాండ్ ను ఈ నెల 26 వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనంతబాబును తరలించారు.ఈ కేసులో పోలీసులు ఇంకా చార్జీషీట్ దాఖలు చేయలేదు.రిమాండ్ పొడిగించడంతో అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఈ ఏడాది మే 20వ తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన సుబ్రమణ్యం హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఎమ్మెల్సీ అనంతబాబు కారణమని పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్రమణ్యం అనుమానాస్పద స్థితి మృతి కేసుకు సంబంధించి సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకుు పోలీసులు కేసు నుమోదు చేశారు. సుబ్రమణ్యాన్ని పద్దతి మార్చుకోవాలని మందలించే క్రమంలో  చేుయి చేసకోవడంతో సుబ్రమణ్యం కింద పడడంతో తలకు గాయం కావడంతో మరణించినట్టుగా పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ కేసులో  దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పోలీసులు  ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారని విపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ కేసు విషయమై పోలీసుల తీరును విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

ఈ కేసులో అరెస్టైన అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. బెయిల్ మంజూరు చేయాలని ఆయన గతంలో కోర్టుల్లో బెయిల్ పిటిసన్లు దాఖలు చేశారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. దీంతో అనంతబాబు జైల్లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే  ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయలేదు. 90 రోజుల్లోపుగా చార్జీషీట్ దాఖలు చేయకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. 

డ్రైవర్ సుబ్రమణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.  వైద్య ఆరోగ్య శాఖలో అపర్ణకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.ఈ మేరకు కలెక్టర్ కృతికా శుక్లా ఈ ఏడాది జూన్ చివర్లో ఉత్తర్వు పత్రాలను అందించారు. 

also read:అనంతబాబు బంధువుల నుంచి బెదిరింపులు: కాకినాడ పోలీసులను ఆశ్రయించిన సుబ్రహ్మణ్యం బాబాయి

ఇదిలా ఉంటే ఈ కేసులో రాష్ట్ర పోలీసుల తీరుపై సుబ్రమణ్యం తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. సీబీఐతో విచారణను జరిపించాలని కోరుతున్నారు. సీబీఐ విచారణతోనే తమకు న్యాయం జరుగుతుందని సుబ్రమణ్యం తల్లిదండ్రులు ఈ ఏడాది జూన్ 10న లేఖ రాశారు. సుబ్రమణ్యం మృతి కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసుల తీరును కూడా ఈ సందర్భంగా ఆ లేఖలో ప్రస్తావించారు. సీబీఐ విచారణ చేయిస్తే తమకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

హత్య కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబుపై వైసీపీ వేటేసింది. ఈ మేరకు ఈ ఏడాది మే 25న అనంతబాబును వైసీపీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. సుబ్రమణ్యం హత్య విషయమై సుమారు 48 గంటల పాటు దళిత సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అనంతబాబు బంధువుల నుండి తమకు బెదిరింపులు వస్తున్నాయని డ్రైవర్ సుబ్రమణ్యం బాబాయి ఈ ఏడాది జూలై 6వ తేదీన పోలీసులకు పిర్యాదు చేశాడు. సుబ్రమణ్యం బాబాయి శ్రీను ఈ మేరకు కాకినాడ టూటౌన్ పోలీసులకు పిర్యాదు చేశాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios