Asianet News TeluguAsianet News Telugu

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : దర్యాప్తు వేగవంతం.. ఈడీ కస్టడీకి నలుగురు నిందితులు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకు సంబంధించి నలుగురు నిందితులను కోర్ట్ ఈడీ కస్టడీకి అనుమతించింది. మొత్తం రూ.241 కోట్ల స్కాం జరగ్గా.. ఇందులో రూ.70 కోట్ల నగదు పక్కదారి పట్టినట్లు  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. 

court allows ed custody for four accused in ap skill development scam
Author
First Published Mar 14, 2023, 7:22 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా స్కాంకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. వీరిని తమ కస్టడీకి అనుమతించాలని చేసిన ఈడీ విజ్ఞప్తిని కోర్ట్ అంగీకరించింది. నలుగురు నిందితులకు ఏడు రోజులు కస్టడీకి అనుమతించింది. సిమ్మెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ ముకుల్ చంద్ర, స్క్రిలర్ ఎంటర్‌ప్రైజెస్ ఎండీతో పాటు పీఏలను ఈడీ అరెస్ట్ చేసింది. మొత్తం రూ.241 కోట్ల స్కాం జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్ధారించింది. ఇందులో రూ.70 కోట్ల నగదు పక్కదారి పట్టినట్లు గుర్తించింది. 

కాగా..చంద్రబాబు నాయడు సీఎంగా ఉన్న సమయంలో  స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లో రూ. 241 కోట్ల కుంభకోణం చోటు చేసుకొందని ఏపీ సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీ సీఐడీ గుర్తించింది.గత ప్రభుత్వ హయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే ముంబైకి చెందిన శిరీష్ చంద్రకాంత్‌‌, మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్‌ గంటా సుబ్బారావును అరెస్ట్ చేసింది ఈడీ. 
 

Follow Us:
Download App:
  • android
  • ios