Asianet News TeluguAsianet News Telugu

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దంపతుల దారుణ హత్య

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చింతూరు మండలం రత్నాపురం గ్రామంలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చోటుచేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

couple murdered in alluri sitarama raju District
Author
First Published Jul 31, 2022, 12:50 PM IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చింతూరు మండలం రత్నాపురం గ్రామంలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వివరాలు.. రత్నాపురం గ్రామానికి చెందిన రంగయ్య, ముత్తమ్మ దంపతులు శనివారం రాత్రి వారి గుడిసెలో నిద్రించారు. అయితే తెల్లవారేసరికి వారు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పరిశీలించి.. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు రంగయ్య, ముత్తమ్మలను హత్య చేసిన ఉంటారని పోలీసుల భావిస్తున్నారు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించారు. వారు ఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతుల గురించి గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. నిందితులు ఎవరు?, హత్యకు గల కారణలమేటి? అని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios