తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద దంపతుల ఆత్మహత్య యత్నం కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని   ఆత్మహత్యయత్నం చేశారు.

తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద దంపతుల ఆత్మహత్య యత్నం కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సీఎం క్యాంపు కార్యాలయంకు వచ్చినట్టు ఆ దంపతులు తెలిపారు. వీరిని నరేష్, సరస్వతీగా గుర్తించారు. ఏం చేయాలో అర్థం కాక, బ్రతకడం వృధా అనిపించి ఆత్మహత్యయత్నం చేసినట్టు తెలిపారు. 

అయితే ఈ దారుణాన్ని సమయానికి గమనించిన పోలీసులు వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ తరువాత దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.