ఎఫైర్: భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం, సూసైడ్

Couple commits suicide for illegal affair in   Chittoor district
Highlights

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

విశాఖ: వివాహేతర బంధం ఇద్దరి ప్రాణాలను తీసుకొంది.
భార్యతో దూరంగా ఉంటున్న వీర్రాజు అనే వ్యక్తి  మరో
మహిళతో  సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరి వివాహనికి
కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వారిద్దరూ
ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో
చోటు చేసుకొంది.

విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం తిమ్మాపురం  
గ్రామానికి చెందిన అత్తి వీర్రాజు  ఆటో డ్రైవర్ గా
పనిచేస్తున్నాడు. ఇతనికి ఏడేళ్ల క్రితం గాజువాకకు చెందిన
యువతితో వివాహమైంది.ఈ దంపతులకు ఓ బాబు, పాప
ఉన్నారు. కొంత కాలం క్రితం భార్య, భర్తల మధ్య
మనస్పర్థలు వచ్చాయి. దీంతో పిల్లలను తీసుకొని భార్య
పుట్టింటికి వెళ్ళిపోయింది. 


తన ఇంట్లోనే వీర్రాజు ఒంటరిగా ఉంటున్నాడు. ఈ
క్రమంలోనే వీర్రాజుకు  డి. అగ్రహరం గ్రామానికి చెందిన
వెంకటలక్ష్మి పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా
వివాహేతర సంబంధానికి దారితీసింది. 

మూడు రోజుల క్రితం  నుండి వెంకటలక్ష్మి
కన్పించకుండాపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె
కోసం గాలిస్తున్నారు. వీర్రాజు ఇంటికి వచ్చి చూసేసరికి
వెంకటలక్ష్మి, వీర్రాజు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడాన్ని
వెంకటలక్ష్మి  బంధువులు గుర్తించారు. 

వెంకటలక్ష్మి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  వీర్రాజుతో
వెంకటలక్ష్మి వివాహనికి కుటుంబసభ్యులు అంగీకరించలేదు.
ఆమెను హైద్రాబాద్ కు పంపిస్తామని చెప్పారు. దీంతో  
వీర్రాజు, వెంకటలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని  
పోలీసులు అనుమానాు వ్యక్తం చేస్తున్నారు. 


 

loader