చిన్నారి డెడ్‌బాడీతో బైక్ పై 120 కి.మీ: విశాఖ కేజీహెచ్ ఆర్ఎంఓ వాదన ఇదీ...


అంబులెన్స్ లేక  120 కి.మీ  దూరం  బైక్ పై  చిన్నారి డెడ్ బాడీని తీసుకెళ్లిన ఘటనపై విచారణ సాగుతుంది.  కేజీహెచ్ సిబ్బంది,  ట్రైబల్ సెల్  వాదనలు మరో రకంగా  ఉన్నాయి.  

 Couple  carried  Child  dead body on bike for 120 km : KGH RMO  Orders  inquiry


విశాఖపట్టణం: కేజీహెచ్ ఆసుపత్రిలో  మరణించిన  చిన్నారిని  120 కి.మీ  పాటు బైక్ పై  తీసుకెళ్లిన  ఘటనపై  వైద్య శాఖ  అంతర్గతంగా విచారణ జరుపుతుంది.  అ్లూరి జిల్లా కుమడ గ్రామానికి చెందిన  దంపతులు తమ చిన్నారికి చికిత్స కోసం  ఈ నెల  2వ తేదీన కేజీహెచ్ ఆసుపత్రిలో  చేర్పించారు.  ఆసుపత్రిలో  చేరే సమయానికి చిన్నారి  తీవ్ర అనారోగ్య సమస్యతో  ఇబ్బంది పడుతున్నట్టుగా ఆర్ఎంఓ  వాసుదేవన్   ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో   చెప్పారు.  కేజీహెచ్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  ఇవాళ  ఉదయం చిన్నారి మృతి చెందినట్టుగా   ఆర్ఎంఓ  తెలిపారు.  చిన్నారి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు  ట్రైబల్ సెల్ అంబులెన్స్ ను  ఏర్పాటు  చేస్తుందని  ఆర్ఎంఓ  చెప్పారు. ట్రైబల్ సెల్  అంబులెన్స్   ఏర్పాటు  చేయని  విషయం తమ దృష్టికి తీసుకొస్తే  ప్రత్యామ్నాయం ఏర్పాటు  చేసే వాళ్లమని  ఆర్ఎంఓ  తెలిపారు..  సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని  చిన్నారి మృతదేహన్ని  పేరేంట్స్  ఎలా తీసుకెళ్లారనే దానిపై విచారణ చేస్తున్నామని  ఆర్ఎంఓ  చెప్పారు. 

ఇదిలా ఉంటే  ట్రైబల్ సెల్  సిబ్బంది వాదన మరో రకంగా  ఉంది.  తాము  అంబులెన్స్  ఏర్పాటు  చేసే సమయానికే  ఆసుపత్రి నుండి   చిన్నారి  కుటుంబ సభ్యులు  వెళ్లిపోయారని ట్రైబల్ సెల్  కోఆర్డినెటర్   ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో   తెలిపారు.  వాహనం నెంబర్ తీసుకొని  వాహనం రాకముందే  బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో  వెళ్లిపోయారని  ట్రైబల్  సెల్  సిబ్బంది  చెబుతున్నారు.  చిన్నారి మృతదేహం తరలించేందుకు  తమకు ఫోన్ ద్వారా సమాచారం  వచ్చిందని  ఆయన  చెప్పారు.   చిన్నారి మృతదేహంతో  పేరేంట్స్ వెళ్లిన విషయం తెలుసుకొని  పాడేరులో  వారికి అంబులెన్స్ ను  ఏర్పాటు  చేసినట్టుగా  ట్రైబల్ సెల్ సిబ్బంది  చెప్పారు. 

also read:విశాఖలో అమానవీయ ఘటన: అంబులెన్స్ లేక 120 కి.మీ బైక్‌పై చిన్నారి డెడ్ బాడీ

ఈ ఘటనపై  డిప్యూటీ సీఎం  రాజన్న దొర  విచారణకు  ఆదేశించారు.  మరో వైపు  ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ  కూడా విచారణ  నిర్వహిస్తుంది.చిన్నారి మృతికి గల కారణాలతో పాటు  అంబులెన్స్  విషయమై  కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.15 రోజుల చిన్నారి  ఆసుపత్రిలో  చనిపోతే  స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు  అవసరమైన అంబులెన్స్  ఎందుకు  సమకూర్చలేకపోయారనే విషయమై  విచారణ  సాగుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios