విశాఖలో అమానవీయ ఘటన: అంబులెన్స్ లేక 120 కి.మీ బైక్‌పై చిన్నారి డెడ్ బాడీ
చిన్నారి మృతదేహన్ని ఆసుపత్రి నుండి స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో బైక్ పై తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
విశాఖపట్టణం: ప్రభుత్వ అంబులెన్స్ సౌకర్యం లేక పసిపాప మృతదేహంతో 120 కి.మీ దూరం స్కూటీపై తీసుకొచ్చారు కుటుంబసభ్యులు. అల్లూరి జిల్లా కుమడ గ్రామానికి చెందిన దంపతలు శిశువు గురువారం నాడు మరణించింది. విశాఖపట్టణం కేజీహెచ్ నుండి పాడేరు వరకు 120 కి.మీ దూరం స్కూటీపై రోజుల చిన్నారి మృతదేహంతో పేరేంట్స్ వెళ్లారు. అంబులెన్స్ చిన్నారి మృతదేహం తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని తాము కోరినా కూడా కేజీహెచ్ ఆసుపత్రి వర్గాలు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చేసేదిలేక బైక్ పై మృత శిశువును 120 కి.మీ తీసుకెళ్లినట్టుగా బాధితులు చెబుతున్నారు. స్కూటీపై మృత శిశువును తీసుకెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న వైద్య సిబ్బంది పాడేరుకు అంబులెన్స్ ను తీసుకు వచ్చారు. పాడేరు నుండి అంబులెన్స్ లో చిన్నారి మృతదేహన్ని కుమడ గ్రామానికి తీసుకెళ్లారు. ఆసుపత్రి నిర్లక్ష్యంగా కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని చిన్నారి పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.
ఈ నెల 2వ తేదీన కేజీహెచ్ ఆసుపత్రిలో చిన్నారిని చేర్పించినట్టుగా పేరేంట్స్ చెప్పారు. ప్రతి రోజూ చిన్నారి నుండి రక్త నమూనాలు సేకరించారన్నారు. కానీ చిన్నారికి ఏం జరిగిందో కూడా ఆసుపత్రి సిబ్బంది చెప్పలేదన్నారు. ఇవాళ ఉదయం చిన్నారి మృతి చెందినట్టుగా వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు. తమ స్వగ్రామానికి చిన్నారి మృతదేహన్ని తీసుకెళ్లేందుకు ఐటీడీఏ అధికారుల వద్దకు వెళ్లినా అంబులెన్స్ ఇవ్వలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. చిన్నారి మృతికి గల కారణాలు చెప్పాలని పేరేంట్స్ డిమాండ్ చేస్తున్నారు.